- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rahul Gandhi: అది వ్యక్తిగత వ్యవహారం కాదు.. ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ వ్యవహారంలో ప్రధాని మోడీ(PM Modi) తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు మోడీ ఇచ్చిన సమాధానాన్ని తప్పుబట్టారు. రాయ్ బరేలీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోడీజీ.. అది వ్యక్తిగత అంశం కాదు. దేశప్రయోజనాలకు సంబంధించిన విషయం’’ అని మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇకపోతే, ఇటీవలే మోడీ అమెరికాలో పర్యటించారు. కాగా.. ఆ పర్యటనలో అదానీ గ్రూప్ పై అమెరికాలో పెట్టిన కేసు గురించి ట్రంప్ తో భేటీ సమయంలో చర్చించారా? అని నేషనల్ మీడియా మోడీని ప్రశ్నించింది భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని.. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరని మోడీ వెల్లడించారు. అయితే, ఈ విషయంపైనే రాహుల్ విమర్శలు గుప్పించారు. గతంలోనూ ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ విషయం గురించి దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే మౌనం దాల్చే ప్రధానమంత్రి.. అదే ప్రశ్నను విదేశాల్లో ఎవరైనా అడిగితే అది వ్యక్తిగత విషయమని బదులిస్తారు’’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
అసలేం జరిగిందంటే?
కాగా.. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా పలువురికి లంచాలు ఇచ్చినట్లు ఎఫ్ సీపీఏ కింద పలువురిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడి కింద అదానీ గ్రూప్ సమీకరించింది. దీంతో, అక్కడ కేసు నమోదైంది. ఇటీవలే వ్యాపారాల్లో కొనసాగడానికి, ప్రాజెక్టులు దక్కించుకోవడానికి విదేశీ ప్రభుత్వాలు, అధికారులకు లంచం ఇచ్చే అమెరికా కంపెనీలు, విదేశీ సంస్థలపై చర్యలు తీసుకొనే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ) అమలును నిలిపేస్తూ ట్రంప్ సంతకాలు చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ ఈ ఆదేశాలు జారీ చేయడంతో అదానీ గ్రూప్‌నకు ఊరట లభించింది.