- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rahul Gandhi: దేశంలోని ప్రతి దళితుడూ అంబేడ్కరే.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని ప్రతి దళితుడూ అంబేడ్కరేనని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన రాయ్ బరేలీ (Raibareli) లో పర్యటించిన ఆయన దళిత విద్యార్థులతో సంభాషించారు. దళితులు వేల సంవత్సరాలుగా వివక్షను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ వివక్షను దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేడ్కర్ దళితుల ప్రస్తావన తీసుకొచ్చారని గుర్తు చేశారు. దళితులు రాజకీయంగా ఎదగడానికి రాజ్యాంగమే దోహదపడిందని తెలిపారు. దేశంలోని గొప్ప వ్యక్తుల ఆలోచనలు రాజ్యాంగంలో ఉన్నాయని కొనియాడారు. కానీ రాజ్యాంగ లక్ష్యాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు అణచివేస్తున్నారని ఫైర్ అయ్యారు.
దేశ జనాభాలో దళితులు 15 శాతం ఉన్నారని.. కానీ బడా కంపెనీల సీఈఓలు, యజమానులు ఆ నిష్పత్తిలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్ర జరుగుతోంది. దానిని కాపాడుకోవడం మన బాధ్యత. దళితులు విద్యావంతులు కావాలని అంబేద్కర్ కోరుకున్నారు. తద్వారా రు తమ న్యాయమైన హక్కులను సాధించుకోగలరు’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జై భీమ్ వంటి కార్యక్రమాల ద్వారా దళితుల సమస్యలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తోందని నొక్కి చెప్పారు. బీఎస్పీ చీఫ్ మాయవతి మాత్రం ఓటు బ్యాంకులో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.