- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul gandhi: దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై కేంద్రం దాడి.. ‘లేటరల్ ఎంట్రీ’పై మరోసారి రాహుల్ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: లేటరల్ ఎంట్రీ అంశంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లేటరల్ ఎంట్రీ ద్వారా దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై కేంద్రం దాడి చేస్తుందని మండిపడ్డారు. బహుజనుల నుంచి రిజర్వేషన్లను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తోందని తెలిపారు. ఇది సరైన పద్దతి కాదని ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేసే ప్రభుత్వ చర్యను రాహుల్ దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు.
కాగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం 45 మంది జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను లేటరల్ ఎంట్రీ ద్వారా నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే లేటరల్ ఎంట్రీ అనే భావన మొదటిసారిగా ప్రవేశపెట్టబడిందని, 2005లో ఏర్పాటు చేసిన రెండో పరిపాలనా సంస్కరణల సంఘం దీనికి మద్దతిచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీఏ అభివృద్ధి చేసిన పద్దతిని అమలు చేయడాకే బీజేపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.