- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ 10 జన్మలెత్తినా సావర్కర్ కాలేరు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ మళ్లీ 10 జన్మలు ఎత్తినా సావర్కర్ లాగా ఉండలేరని దుయ్యబట్టారు. ఆదివారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జితో అహింత రన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను దేశం ఎప్పుడు క్షమించబోదని అన్నారు. సావర్కర్ తన జీవితం స్వాతంత్ర్య ఉద్యమం కోసం పనిచేస్తే... రాహుల్ మాత్రం బ్రిటిషర్ల సహాయంతో భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. గత నెల 25న రాహుల్ మాట్లాడుతూ 'నా పేరు సావర్కర్ కాదు.. నేను గాంధీని.. గాంధీ ఎప్పుడు ఎవ్వరికీ క్షమాపణ చెప్పరు’ అని అన్నారు. దీనిపై మహారాష్ట్ర నేతలతోపాటు బీజేపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్సీపీ నేత శరద్ పవార్ సూచనతో రాహుల్ ఇకపై సావర్కర్ నుద్దేశించి మాట్లాడటం తగ్గిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.