రాజ్యసభ ఛైర్మన్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పండి.. ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు ఆదేశం

by Harish |   ( Updated:2023-11-03 11:26:29.0  )
రాజ్యసభ ఛైర్మన్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పండి.. ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు ఆదేశం
X

న్యూఢిల్లీ: బేషరతుగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌‌కు క్షమాపణలు చెప్పాలని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండో వారంలో ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్’ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

అయితే ఈ సందర్భంగా బిల్లును వ్యతిరేకించే తీర్మాన ప్రతిలో ఐదుగురు రాజ్యసభ ఎంపీల పేర్లను చద్దా చేర్చడం వివాదానికి దారితీసింది. బిల్లును వ్యతిరేకించకున్నా.. వ్యతిరేకించినట్టుగా తమ పేర్లను తీర్మానంలో పొందుపర్చడంపై ఐదుగురు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 11న రాఘవ్ చద్దాను సస్పెండ్ చేశారు. నిర్ణీత గడువు లేకుండా తనను సస్పెండ్ చేయడంపై సుప్రీంకోర్టును చద్దా ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed