- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
QS Rankings: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రిలీజ్.. ఇండియా నుంచి ఐఐటీ ఢిల్లీ ఫస్ట్ ప్లేస్..!
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్న విద్యాసంస్థల(Educational institutions) జాబితాను క్యూఎస్ ర్యాంకింగ్స్(QS Rankings) ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 107 దేశాల నుంచి 1,740 యూనివర్సిటీలకు ఈ జాబితాలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇక ఈ సంవత్సరం క్యూఎస్ ర్యాంకింగ్స్ లో టొరంటో యూనివర్సిటీ(UoT) తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఈటీహెచ్ జ్యూరిచ్(ETH Zurich) నిలిచింది. స్వీడన్(sweden)లోని లండ్ విశ్వవిద్యాలయం(LU), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్ లీ(UCB)లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.
ఇదిలా ఉంటే.. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో మొత్తం 78 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో 21 ఉన్నత విద్యాసంస్థలు కొత్తగా చేరాయి. ఇక దేశంలోని టాప్ 10 విద్యాసంస్థల్లో 9 సంస్థలు తమ స్థానాల్ని మెరుగుపరుచుకున్నాయి. ఈ జాబితాలో ఐఐటీ ఢిల్లీ(IIT Delhi) తొలి స్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 171వ స్థానంలో నిలిచింది. ఆ యూనివర్సిటీ గత సంవత్సరం కన్నా ఈ సారి 255 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. ఇక ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్(Environment Education)లో బెంగళూరు(bengaluru)లోని ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC) ప్రపంచంలోని టాప్ 50లో చోటు దక్కించుకుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ అండ్ గవర్నెన్స్ అనే మూడు అసెస్ మెంట్ కేటగిరీల్లో పనితీరు ఆధారంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకటిస్తారు.