వయనాడ్‌లో ప్రకృతి విళయం.. బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ

by Mahesh |   ( Updated:2024-08-11 13:31:12.0  )
వయనాడ్‌లో ప్రకృతి విళయం.. బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 29 సోమవారం అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కేరళలోని వయనాడులోని మోప్పాడ్ లో ప్రకృతి విలయతాండవం చేసింది. కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా భారీ వరద తలెత్తి పూర్తి గ్రామాన్ని శిథిలాలు ముంచెత్తాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 415 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది వరకు గల్లంతయ్యారు. కాగా ఈ ప్రమాదంపై ఈ రోజు ప్రధాని మోడీ ఏరియల్ సర్వే చేశారు. అంతకు ముందు సీఎం పినరయి విజయన్ తో భేటీ అయిన ప్రధాని మోడీ సీఎంతో కలిసి విమానంలో ఎరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వయనాడ్‌ రిలీఫ్‌ క్యాంప్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రధాని పరామర్శించారు. ఈ ప్రకృతి విలయతాండవంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ మాట్లాడారు. అలాగే బాధితులకు తాము అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు, కొండచరియ విధ్వంసం గురించి ప్రధానికి వివరిస్తూ పలువురు బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement

Next Story