Prashanth kishore: ఆందోళన అవసరం లేదు.. ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్

by vinod kumar |
Prashanth kishore: ఆందోళన అవసరం లేదు.. ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తమ పార్టీ పరాజయం పాలవడంపై జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దశాబ్దాల పాలనలో రాష్ట్రం ఎంతో వెనుకబడిందని, అయినప్పటికీ బైపోల్స్‌(By polls)లో ఎన్డీఏ విజయం సాధించడం ఆందోళనకరమని తెలిపారు. ఫలితాలు వెల్లడైన అనంతరం ఆయన పాట్నా(Patna)లో మీడియాతో మాట్లాడారు. ‘బిహార్ పాలిటిక్స్‌లో రాష్ట్రీలయ జనతాదళ్(RJD)కి 30 ఏళ్ల అనుభవం ఉంది. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కుమారుడు మూడో స్థానంలో నిలిచారు. ఇటువంటి టైంలో జన్ సూరజ్‌ని తప్పు పట్టొచ్చా? బెలగంజ్‌లో ముస్లిం ఓట్లన్నీ జనతాదళ్ యునైటెడ్(JDU) అభ్యర్థికే పడ్డాయి. ఇమామ్‌గంజ్‌లో జన్ సూరజ్ ఎన్డీఏ ఓట్లను చీల్చింది. లేకుంటే, జితన్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామీ మోర్చా మెజారిటీ ఎక్కువగా ఉండేది’ అని తెలిపారు. ఎన్నికల్లో జన్‌సూరజ్‌కు వచ్చిన ఓట్లపై ఆందోళన అవసరం లేదన్నారు. ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయడమే ఆందోళనగా ఉందన్నారు. మా పోరాటం ఆర్జేడీతో కాదని, ఎన్డీఏతోనేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు.

Next Story