మద్యం బాటిల్‌కు ఓటేసే వారికి ఆ హక్కే లేదు.. ఓటర్లపై పీకే సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-16 12:13:42.0  )
మద్యం బాటిల్‌కు ఓటేసే వారికి ఆ హక్కే లేదు.. ఓటర్లపై పీకే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తే.. వారి నేత దొంగ కాకుండా హరిశ్చంద్రుడు అవుతాడా అని ప్రశ్నించారు. రూ. 500లకు ఓటును అమ్ముకున్నప్పుడు.. నేతను హరిశ్చంద్రుడిగా ఉండమనడం అన్యాయమని అన్నారు. ప్రజలు అవినీతిపరులైతే.. నేతలు హరిశ్చంద్రులు అవుతారా అని ప్రశ్నించారు. ఓటరు అవినీతిపరుడైతే.. రాజకీయ నేతలు కూడా అవినీతిపరులే అవుతారన్నారు. రూ.500లకు ఓటు అమ్ముకుంటే మీ నేత.. మీ గౌరవమర్యాదలను రూ.5 వేలకు అమ్ముకుంటాడని కీలక వ్యాఖ్యలు చేశారు. చికెన్ బిర్యానీకి, మద్యం బాటిల్‌కు ఓటు వేసేవారికి నేతలను నిలదీసే అవకాశం లేదన్నారు. యథా ప్రజ.. తథా నేత అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Next Story

Most Viewed