- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Prashant Kishor: అధికారంలోకి వచ్చన రెండుగంటల్లోనే మద్యాపాన నిషేధాన్ని ఎత్తివేస్తాం
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో(Bihar) తమ పార్టీ అధికారంలోకి వస్తే గంటలోనే మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ అధినేత(Jan Suraaj) ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) హామీ ఇచ్చారు. అక్టోబరు 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని గుర్తుచేశారు. పార్టీ ఏర్పాట్లను వివరిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బిహార్‌లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తాం. మద్యపాన నిషేధ చట్టం నితీశ్ కుమార్ తీసుకొచ్చిన బూటకం తప్ప మరోటి కాదు.’ అని తెలిపారు.
మద్యపాన నిషేధంపై విమర్శలు
ప్రస్తుతం అమలు చేస్తున్న మద్యపాన నిషేధం పనికిరాదని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఇది మద్యం అక్రమ హోండెలివరీలకు దారితీసిందన్నారు. రూ.20 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని బిహార్ కోల్పోయిందని పేర్కొన్నారు. మద్యం వ్యాపారాన్ని అక్రమంగా నిర్వహిస్తూ రాజకీయ నాయకులు, అధికారులు లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. తాను "కాబీలియత్ కీ రాజనీతి (మెరిట్ రాజకీయాలు)"ని నమ్ముతానని స్పష్టం చేశారు. ఇతర పార్టీలలా మద్యం నిషేధిస్తే మహిళల ఓటు బ్యాంకు నష్టం వాటిల్లుతుందని మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడబోనని అన్నారు. బిహార్ దుస్థితికి, నితీశ్ కుమార్, లాలూ ప్రసాదం కారణమని ఆరోపించిన పీకే.. ఆ నిందను మాత్రం కాంగ్రెస్, బీజేపీ పంచుకుంటున్నాయని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు.