Prakash Raj : ఉగ్రదాడిపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

by M.Rajitha |
Prakash Raj : ఉగ్రదాడిపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు ప్రపంచాన్ని కుదుపు కుదిపేసిన ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ ఉగ్రదాడిపై నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) సీరియస్ అయ్యారు. ఇది అమయాకులపై జరిగిన దాడి కాదని, మొత్తం కశ్మీర్ పై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ దుశ్చర్యపై కశ్మీరీలు మౌనం వీడి, ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

పహల్గాం ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలివపయిన ప్రకాష్ రాజ్.. ఈ దాడి తన హృదయాన్ని మెలిపెట్టిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చూసి తన రక్తం మరిగిందన్నారు. ఇలాంటి వాటిని అస్సలు క్షమించకూడదని, ఇది ముష్కరుల పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. భారత్ ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోదని, త్వరలోనే ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేశారు.


Next Story

Most Viewed