Poonch attack : పూంచ్ ఉగ్రదాడి ఘటనలో అమరులైన మరో ఇద్దరు జవాన్లు..

by Vinod kumar |   ( Updated:2023-12-22 12:06:16.0  )
Poonch attack : పూంచ్ ఉగ్రదాడి ఘటనలో అమరులైన మరో ఇద్దరు జవాన్లు..
X

శ్రీన‌గ‌ర్ : జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికుల సంఖ్య ఐదుకు పెరిగింది. గురువారం రాత్రి సమయానికి ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన ఇంకో ఇద్దరు ఆర్మీ జవాన్లు చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. అమరులైన భారత జవాన్లలో నలుగురిని నాయక్ బీరేంద్ర సింగ్, నాయక్ కరణ్ కుమార్, రైఫిల్ మ్యాన్ చందన్ కుమార్, రైఫిల్ మ్యాన్ గౌతమ్ కుమార్‌లుగా గుర్తించారు. గాయపడిన నలుగురు సైనికులలో ఒకరు చనిపోయారు. అయితే వారి పేరు, వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక ఈ ఉగ్రదాడికి తామే బాధ్యుల‌మ‌ని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్‌‌ ప్రక‌టించింది.

ఆర్మీ ట్రక్కుల్లో వెళ్తున్న జ‌వాన్లపై ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో కాల్పులు జ‌రిపామని వెల్లడించింది. దీనికి సంబందించిన ఓ ఫొటోను కూడా ఉగ్రమూకలు విడుదల చేశారు. అమెరికా తయారీ తుపాకీ ఎం4 కార్బైన్‌‌ ఆ ఫొటోలో కనిపించింది. ఇటీవ‌లి కాలంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో చోటు చేసుకుంటున్న ప్రతి ఉగ్రదాడికి తామే బాధ్యుల‌మ‌ని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్‌‌ ప్రక‌టిస్తూ వ‌స్తోంది.

Advertisement

Next Story

Most Viewed