BREAKING: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 11వ సారి పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

by Shiva |   ( Updated:2024-08-15 16:34:41.0  )
BREAKING: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 11వ సారి పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. ముందుగా ఆయన రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించి ఎర్రకోట ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఆయన త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు సైనిక విభాగాల కావాతులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్య్రమానికి కేంద్ర మంతులు, ఎంపీలు, సైనికాధికారులు, పలువురు సెలబ్రిటీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రకోట చుట్టూ ఉన్న రహదారులను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఉదయం 4 గంటల క్లోజ్ చేసి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

నేతాజీ సుభాష్ మార్గ్ ఢిల్లీ గేట్ నుంచి చట్టా రైల్ వరకు, లోథియన్ రోడ్ జీపీవో నుంచి చట్టా రైల్ వరకు, ఎస్పీ ముఖర్జీ మార్గ్ హెచ్ సేన్ మార్గ్ నుంచి యమునా బజార్ చౌక్ వరకు, చాందినీ చౌక్ రోడ్ ఫౌంటెన్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు నిషాద్ రాజ్ మార్గ్ రింగ్ రోడ్ నుంచి నేతాజీ సుభాష్ మార్గ్ వరకు, ఎస్ప్లానేడ్ రోడ్, దాని లింక్ రోడ్ నేతాజీ సుభాష్ మార్గ్, రాజ్‌ఘాట్ నుంచి ఐఎస్‌బీ‌టీ వరకు రింగ్ రోడ్, ఐఎస్‌బీటీ నుంచి ఐపీ ఫ్లైఓవర్ వరకు ఔటర్ రింగ్ రోడ్ మార్గాల్లో స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఉదయం 4 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి.

Advertisement

Next Story