- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరల్ వీడియో : ‘అబ్కీ బార్ 400 పార్’.. ఖర్గే సెటైర్.. మోడీ నవ్వులు
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అబ్కీ బార్ 400 పార్’’ అని బీజేపీని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్‌కు ప్రధాని మోడీ చిరునవ్వులు చిందించారు. ‘‘మీకు 334 సీట్లతో లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉంది. ఈసారి అది 400 దాటుతుందని (అబ్కీ బార్ 400 పార్) మీరు చెప్పుకుంటున్నారు’’ అని రాజ్యసభలో బీజేపీపై ఖర్గే సెటైర్స్ పేల్చారు. వీటిని విన్న వెంటనే సభలోని సభ్యుల మొహాల్లో నవ్వులు విరబూశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ట్రెజరీ బెంచ్‌లో కూర్చున్న వారంతా నవ్వుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇస్తూ.. ‘‘మేం కలలు కనడం లేదు. వాస్తవాలను చెబుతున్నాం. ప్రజలంతా మోడీ వైపే నిలుస్తున్నారు’’ అని బదులిచ్చారు.
PM Modi be like, "I need new haters, the old ones have become my fans..." pic.twitter.com/dnpc5e0vI9
— BJP (@BJP4India) February 2, 2024