Vande Bharat trains: జార్ఖండ్ లో ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ

by Shamantha N |
Vande Bharat trains: జార్ఖండ్ లో ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వందే భారత్‌ రైళ్లను(Vande Bharat trains) ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆదివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. జార్ఖండ్‌కు(Jharkhand) వెళ్లిన ప్రధాని మోడీ టాటానగర్(Tatanagar) జంక్షన్ రైల్వే స్టేషన్‌లో వర్చువల్ గా ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. వేగవంతమైన కనెక్టివిటీ, సురక్షితమైన ప్రయాణాలు అందనున్నాయని పీఎంవో ప్రకటనలో తెలిపింది. మెరుగైన కనెక్టివిటీ కోసం, కొత్త రైళ్లతో వందేభారత్ పోర్ట్ ఫోలియో ఎప్పటికప్పుడు విస్తరిస్తోందంది. ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా వంటి ఆరు కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. అలానే, వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్‌లో 20,000 మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ (PMAY-G) లబ్ధిదారులకు రూ.660 కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

గంటకు 120 కి.మీ. వేగంతో..

ఈ వందే భారత్‌ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో ఇవి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 54 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మొత్తం 36 వేల ట్రిప్పులను పూర్తి చేశామని ప్రకటించింది. 3.17 కోట్ల మంది ప్రయాణికులు వందేభారత్ రైళ్లలో ప్రయాణం చేశారంది.

Advertisement

Next Story

Most Viewed