- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యంత ఆదరణ కలిగిన ప్రపంచ నేతగా మోడీ
న్యూఢిల్లీ: అత్యంత ఆదరణ పొందిన ప్రపంచ నేతల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ చేసిన సర్వేలో ప్రధాని మోడీకి 78 శాతం మంది ఆమోదం తెలిపారని వెల్లడించింది. సర్వే ప్రకారం మోడీతో పాటు జాబితాలో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాని రిషి సునక్ ఉన్నారు. మొత్తం 22 మంది ప్రపంచ నేతలపై సర్వే నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది.
గత నెల 26 నుంచి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. దీనిలో మోడీకి 78 శాతం మంది ఆమోదం తెలుపుతూ రేటింగ్స్ ఇవ్వగా, ఆ తర్వాత మెక్సికన్ అధ్యక్షుడు అండ్రెస్ మాన్యుల్ లోపెజ్ 68 శాతం రేటింగ్స్‌తో రెండో స్థానంలో, స్విస్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం రేటింగ్స్‌తో మూడో స్థానంలో నిలిచారు. 2022 భారత విదేశాంగ విధానంలో అద్భుతమైన ఏడాదిగా నిలిచింది. అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని కోరుతూ ఇది యుద్ధాల యుగం కాదని మోడీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
యూఎస్‌తో పాటు పాశ్చాత్య దేశాలు ప్రధాని వ్యాఖ్యలను స్వాగతించాయి. ఇక 78 శాతం మంది మోడీకి ఆమోదం తెలుపగా, 18 శాతం మంది మాత్రం తిరస్కరించినట్లు సర్వే పేర్కొంది. తాజాగా జాబితాలో బైడెన్‌కు ఏడో స్థానం, 22 మందిలో నార్వే ప్రధాని జోనస్ గర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చివరి ముగ్గురిలో ఉన్నారు. ఇక తాజాగా ఇటలీ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన జార్జియా మెలోని ఆరో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియన్ ప్రధాని అంథోని అల్బెనెసే, ఐదో స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, ఉన్నారు. యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ఆమోదంత 12వ స్థానంలో నిలిచారు.