PM Modi: గత అనుభవాల నుంచి వాళ్లు గుణపాఠం నేర్వలేదు : పాకిస్థాన్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
PM Modi: గత అనుభవాల నుంచి వాళ్లు గుణపాఠం నేర్వలేదు : పాకిస్థాన్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కార్గిల్ యుద్ధానికి సాక్షిగా లద్ధాఖ్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా దేశం అంతా ఇవాళ ‘కార్గిల్ విజయ్ దివస్’‌ను జరుపుకుంటోంది. ఈ మేరకు లద్ధాఖ్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ప్రధాన మోడీ నివాళులర్పించారు. ఆయనతో పాటు సీడీఎఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో పాటు త్రివిధ దళాలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అమరలు త్యాగాలకు గుర్తుగా ‘విజయ్ దివస్‌’ను జరుపుకుంటున్నామని అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన సైనికులు చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. ప్రజల గుండెల్లో వారు చిరకాలం గుర్తుండిపోతారని కీర్తించారు.

కార్గిల్ యుద్ధ సమయంలో తాను కూడా సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని గుర్తు చేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన పోరాటం తన మదిలో నిలిచిపోయిందని అన్నారు. నేడే వారి త్యాగం వల్లే జమ్ము, కాశ్మీర్‌లో శాంతి నెలకొందని తెలిపారు. అక్కడే జీ-20 సమ్మిట్ కూడా సమర్ధవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. ప్రస్తుతం శ్రీనగర్, లద్ధాఖ్ లాంటి ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. లద్ధాఖ్‌ను కలిపే టన్నెల్ కూడా పూర్తయితే.. రెండు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్వలేదని, ఇక మీదట ఉగ్రవాదాన్ని ఎప్పటీకి ఉపేక్షించేది లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed