- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవంబర్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రాస్-బోర్డర్ రైల్వే ప్రాజెక్టు ప్రారంభం!
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యాన్ని పెంచే కీలక క్రాస్-బోర్డర్ రైల్వే ప్రాజెక్టు బుధవారం(నవంబర్ 1) ప్రారంభం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని సోమవారం అధికారులు ప్రకటించారు. రెండు పొరుగు దేశాల ప్రధానులు అగర్తల-అఖౌరా క్రాస్ బోర్డర్ రైలు ప్రాజెక్టును ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 15 కిలోమీటర్ల ఈ కొత్త రైలు మార్గం భారత్‌లో 5 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లో 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సరిహద్దు వాణిజ్యాన్ని పెంచుతుందని, ఢాకా మీదుగా అగర్తల, కోల్‌కతాల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. ఈ మార్గం ఒక పెద్ద వంతెన, మూడు చిన్న వంతెన్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం రైలులో అగర్తల నుంచి కోల్‌కతా చేరుకునేందుకు దాదాపు 31 గంటల సమయం పడుతోంది. కొత్త రైలు మార్గం ద్వారా ఇది కేవలం 10 గంటలకు తగ్గుతుందని ఓ అధికారి వివరించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు భారతీయ రైల్వే రూ. 153.84 కోట్ల బడెజెట్‌ను కేటాయించిందని అధికారి పేర్కొన్నారు.