6 రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల ప్రాజెక్టులు.. ప్రధాని మోడీ పచ్చజెండా

by Hajipasha |
6 రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల ప్రాజెక్టులు.. ప్రధాని మోడీ పచ్చజెండా
X

దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్రం అనంతరం దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన రాజకీయ పార్టీలు ఈశాన్య, తూర్పు భారత్‌లను విస్మరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. గత పదేళ్లుగా తాము ఈ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామన్నారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఉత్తర పశ్చిమ బెంగాల్‌‌కు సంబంధించిన రూ. 4,500 కోట్లు విలువైన రైల్వే లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టులను ఆవిష్కరించారు. దీంతోపాటు మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన రూ.55,600 కోట్లు విలువైన ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుట్టారు. అరుణాచల్‌‌లోని ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ఈ ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు. వీటిలో రూ.41,000 కోట్లు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ఒక్క అరుణాచల్ ప్రదేశ్‌లోనివే కావడం గమనార్హం. ఈ రాష్ట్రంలోని లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ‘దిబాంగ్ మల్టీపర్పస్ జలవిద్యుత్ ప్రాజెక్టు’కు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీని విలువ రూ.31,875 కోట్లు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్‌గా నిలువనుంది. ఇక దాదాపు రూ.825 కోట్ల వ్యయంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా బార్డర్‌లో నిర్మించిన సేలా సొరంగాన్ని మోడీ ప్రారంభించారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.450 కోట్లతో నిర్మించిన 35వేల కంటే ఎక్కువ ఇళ్లను అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. ఇక వర్చువల్‌గా అసోంలో రూ.17,500 కోట్లు, త్రిపురలో రూ.8,500 కోట్లు, మణిపూర్‌లో రూ.3,400 కోట్లు, నాగాలాండ్‌లో రూ.1,700 కోట్లు, మేఘాలయలో రూ.290 కోట్లు, సిక్కింలో రూ.450 కోట్లు విలువైన ప్రాజెక్టులను ప్రధాని ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed