ఇది ప్రజా బడ్జెట్ : ప్రధాని మోడీ

by Ajay kumar |
ఇది ప్రజా బడ్జెట్ : ప్రధాని మోడీ
X

- 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది

- ప్రజల సేవింగ్స్ పెంచే బడ్జెట్

దిశ, నేషనల్ బ్యూరో:

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను 'ప్రజా బడ్జెట్'గా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందని ఆయన ఆకాంక్షించారు. పారమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వేతన జీవులకు ఈ బడ్జెట్ ద్వారా ఊరట కలిగింది. తయారీ రంగంపై అన్ని కోణాల్లో దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో పర్యాటకానికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని మోడీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి 50 పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ బడ్జెట్ వల్ల మరింతగా పొదుపు చేసుకుంటారని, పెట్టుబడులు కూడా పెరుగుతాయని అన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలకమైన మైలురాయిగా మోడీ పేర్కొన్నారు. అనేక రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అన్ని బడ్జెట్‌లు ఖజానాను నింపడంపై దృష్టి పెడతాయి, కానీ ఈ సారి మాత్రం ప్రజల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని మోడీ తెలిపారు. కాగా, బడ్జెట్ ప్రవేశపపెట్టిన నిర్మలా సీతారామన్ దగ్గరకు ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి ఆమెను ప్రశంసించడం గమనార్హం

కేంద్ర బడ్జెట్‌పై హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఇది మోడీ మార్క్ బడ్జెట్ అని కొనియాడారు. మోడీ మనసులో మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ చోటు ఉంటుంది. పన్ను మినహాయింపు ప్రకటనే అందుకు నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు.

Next Story

Most Viewed