- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైఫల్యాలను మీ గురువుగా భావించండి

- ఓటముల నుంచి అభివృద్ధి చెందండి
- ప్రతీ ఒక్కరికి విభిన్నమైన టాలెంట్ ఉంటుంది
- పిల్లల్లో నైపుణ్యాలను టీచర్స్, పేరెంట్స్ గుర్తించాలి
- పరీక్షా పే చర్చాలో ప్రధాని నరేంద్ర మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థులు తాము చేసే తప్పులను పాఠాలుగా భావించి దాని నుంచి విజయం వైపు వెళ్లాలి. ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయితే ఆ విద్యార్థి జీవితం ఆగిపోదు. మనం పుస్తకాల్లో విజయం సాధించాలా? లేదంటే జీవితంలోనా అనేది నిర్ణయించుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చా' కార్యక్రమాన్ని సుందర్ గార్డెన్స్‌లో ఈ సారి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోడీ పలు సూచనలు చేశారు. మీ వైఫల్యాలనే గురువుగా భావించడండి.. అవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. సాంకేతికాభివృద్ధి అందుబాటులో ఉన్న కాలంలో మీరు జీవిస్తుండటం అదృష్టం. సాంకేతిక నైపుణ్యాలను అర్థం చేసుకొని వాటిని మీకు అవసరమయ్యేలా ఉపయోగించుకోవాలని ప్రధాన మోడీ చెప్పారు. కేవలం పుస్తకాలకే పరమితం అయితే మీరు మరింతగా అభివృద్ధి చెందలేరని ప్రధాని మోడీ తెలిపారు.
విద్యార్థులు రోబోలు కారు..
సమగ్రమైన అభివృద్ధి కోసమే మనం చదువుతున్నాం. మీకు ఇష్టమైన వ్యాపకాల్లో కూడా నిమగ్నమవ్వాలి. అంతే కానీ విద్యార్థులు రోబోల మాదిరిగా పని చేయకూడదు. అప్పుడే మీరు పరీక్షల్లో మంచ ఫలితాలు సాధించగలరు. బయట నుంచ వచ్చే ఒత్తిడి మీద కాకుండా చదువుపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. స్టేడియంలో ఎంతో మంది కేకలు వేస్తూ.. గోల చేస్తుంటారు. అయినా సరే బ్యాటర్ దృష్టి కేవలం బంతి మీదనే ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకోవడం పైనే దృష్ట పెట్టాలని మోడీ సూచించారు. ప్రతీ ఒక్క విద్యార్థికి భిన్నమైన టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ వైపుగా విద్యార్థులను నడిపించాలన మోడీ సూచించారు. పరీక్షలే సర్వస్వం అనే భావనతో విద్యార్థులను పెంచకూడదు. వారలో ఉన్న విశిష్టమైన ప్రతిభను వెలికి తీయాలని టీచర్లకు, పేరెంట్స్‌కు మోడీ సూచించారు.
సమయపాలన అవసరం..
ప్రతీ విద్యార్థికి సమయ పాలన తప్పక అవసరం. రేపు ఏం చేయాలనే విషయాలను ముందుగానే ఒక పేపర్ మీద రాసుకొని.. ఆ పనిని తప్పకుండా పూర్తి చేసేలా ప్రయత్నించండి. ఏ పని కోసం ఎంత సమయం వెచ్చించాలో ఆలోచించుకోవాలని మోడీ సూచించారు. ఇష్టమైన సబ్జెక్ట్‌కు ఎక్కువ సమయం.. ఇష్టం లేని సబ్జెక్ట్‌కు తక్కువ సమయం కేటాయించవద్దు. దానికి భిన్నంగా చేయడానికి ప్రయత్నించాలని మోడీ చెప్పారు. ఇక కేరళకు చెందిన విద్యార్థి ఆంకాన్షా హిందీలో మోడీని పలకరించారు. అంతే కాకుండా విద్యార్థిని హిందీలో రాసిన కవితను కూడా చదివి వినిపించారు.
8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మోడీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే 36 మందికి మాత్రమే ప్రధానితో నేరుగా ముచ్చటించే అవకాశం కలిగింది. మిగిలిన వారు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.