Varanasi: వారణాసి గ్యాంగ్ రేప్ ఘటన.. ఆరా తీసిన మోడీ

by Shamantha N |
Varanasi: వారణాసి గ్యాంగ్ రేప్ ఘటన.. ఆరా తీసిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై జరిగిన దారుణ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) దృష్టికి చేరింది. దీంతో, ప్రస్తుతం వారణాసి పర్యటనలో ఉన్న మోడీ ఈ ఘటనపై ఆరా తీశారు. వారణాసి జిల్లా కలెక్టర్, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మోడీ వారణాసి చేరుకోగానే.. గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్ ని అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

వారణాసిలో గ్యాంగ్ రేప్..!

కాగా.. వారణాసిలో వారం రోజుల్లో 23 మంది వ్యక్తులు.. 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. మార్చి 29న బాధిత యువతి కొంతమంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఆ యువతి వెల్లడించిన వివరాల ప్రకారం.. కొందరు యువకులు తనను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దర్యాప్తు జరిపిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మిగితా వారి కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed