- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో ద్వేషాన్ని పెంచేవారిని కర్నాటక ప్రజలు ఓడించారు: రాహుల్ గాంధీ
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్దతు లభించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం కంఠీరవ స్టేడియంలో జరిగిన కర్నాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అవినీతిపరులను, ద్వేషాన్ని పెంచేవారని కర్నాటక ప్రజలు ఓడించారని అన్నారు. కర్నాటకలో పేద ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
కర్నాటకలో కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని అందించిన ఓటర్లుకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఇక, కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రమాణం స్వీకారం చేశారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం ప్రమాణం స్వీకారం చేశారు. వీరి చేత రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, కమల్‌హాసన్ తదితరులు హాజరయ్యారు.