ఒకే ఒక్కడు.. 200 మందికి ముచ్చెమటలు పట్టించిండు.. విమానం గాల్లో ఉండగానే డోర్స్ ఓపెన్ చేసి.. (వీడియో)

by sudharani |
ఒకే ఒక్కడు.. 200 మందికి ముచ్చెమటలు పట్టించిండు.. విమానం గాల్లో ఉండగానే డోర్స్ ఓపెన్ చేసి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో విమానంలో జరిగే విన్యాసాలు ఎక్కువైపోతున్నాయి. ఏవో కారణాల చేత విమాన ప్రయాణికులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి విమానం వార్తల్లోకి ఎక్కింది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే డోర్ ఓపెన్ చేశాడు. దీంతో 200 మందికి పైగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏ321 విమానం దక్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్లేందుకు బయలుదేరింది. 200 మందికి పైగా ఉన్న విమానం గాలిలో ఉన్న క్రమంలో.. ఓ ప్రయాణికుడు విమానంలో ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని డేగు విమానాశ్రమంలో దించారు. అయితే.. విమానం ల్యాండ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడు డోర్స్ ఎందుకు ఓపెన్ చేశాడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా.. విమానం గాలిలో ఉండగా డోర్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story