- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
72 ఏళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలిక పెళ్లి.. అడ్డుకున్న పోలీసులు
దిశ, నేషనల్ బ్యూరో: అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను ఆమె తండ్రి బలవంతంగా 72 ఏళ్ల వృద్ధుడితో వివాహం చేయాలని చూడగా, దానిని పోలీసులు అడ్డుకుని ఆ బాలికను కాపాడారు. ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. అక్కడి మీడియాలో వచ్చిన దాని ప్రకారం, చర్సద్దా పట్టణంలో 12 ఏళ్ల బాలిక తండ్రి ఆలం సయ్యద్ ఆమెను హబీబ్ ఖాన్ అనే ఒక వృద్ధుడికి 5,00,000 రూపాయలకు విక్రయించడానికి అంగీకరించాడు. బలవంతంగా ఆ బాలికను, వృద్ధిడితో పెళ్లి చేయాలని చూశారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. ఆ వృద్ధుడిని అరెస్ట్ చేశారు. అలాగే, ఈ పెళ్లి జరిపించే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తండ్రి, 72 ఏళ్ల వరుడు, పెళ్లి జరిపించే వ్యక్తిపై పోలీసులు బాల్య వివాహ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పాకిస్తాన్‌లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల, రాజన్‌పూర్, తట్టాలో ఇలాంటి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు, ఇతర కారణాలతో తమ పిల్లలను విక్రయిస్తున్నారు. లోక జ్ఞానం కూడా తెలియని బాలికలను బలవంతంగా పెద్దవారితో వివాహం చేస్తున్నారు. రాజన్‌పూర్‌లో 11 ఏళ్ల బాలికను, 40 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయాలని చూశారు. తట్టాలోని 50 ఏళ్ల వ్యక్తితో ఒక యువతిని బలవంతంగా వివాహం జరిపించాలని చూడగా అదృష్టవశాత్తూ, పోలీసులు సకాలంలో ఆమెను రక్షించారు. అంతకుముందు మే 6న, స్వాత్‌లో 13 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నందుకు 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.