డ్రోన్‌తో టెర్రరిస్టులను పంజాబ్‌లో దీంచుతున్న పాక్

by Mahesh |
డ్రోన్‌తో టెర్రరిస్టులను పంజాబ్‌లో దీంచుతున్న పాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ కు చెందిన ఓ ఉగ్రవాదిని లష్కరే తోయిబా.. డ్రోన్ సహాయంతో పంజాబ్‌లో దించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో‌లో భారీ డ్రోన్ సుమారు 70 కేజీల బరువున్న బ్యక్తిని తీసుకుకొచ్చి పంజాబ్ బోర్డర్ ఇవతల వదిలిపెట్టడం కనిపింది. అయితే ఆ డ్రోన్‌ను భారత జవాన్లు పడగొట్టారు. అలాగే ఆ ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఆ వీడియోలో పాకిస్తాన్‌లోని షకర్‌గఢ్‌లోని ఎల్‌ఇటి డ్రోన్ శిక్షణా శిబిరంలో చిత్రీకరించబడిన ప్రత్యేకమైన వీడియో, ఉగ్రవాదులు డ్రోన్‌ల సామర్థ్యాన్ని పరీక్షించి మానవుడిని నీటిలో పడవేస్తున్నట్లు చూపిస్తుంది.

అయితే ఆ ఉగ్రవాదిని ఆర్మీ అధికారులు పట్టుకుని విచారించగా.. తనను లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉన్నతాధికారులు పంపారని డబ్బు కూడా ఇచ్చారని అతను వెల్లడించాడు. అతనికి ఓ పని అప్పగించారని.. అది చేయడానికికే పంజాబ్‌లో అతనిని డ్రాప్ చేసినట్లు తెలిపాడు. అయితే గత కొద్ది రోజులు పాకిస్థాన్ ఉగ్రవాదుల ఈ డ్రోన్లను ఉపయోగింది. పంజాబ్, జమ్మూ - కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్, ఆయుదాలను భారత భూభాగంలో పడవేస్తున్నట్లు భారత్ గుర్తించింది.

Advertisement

Next Story

Most Viewed