సిక్కింలో భారీ వర్షాలకు చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులు.. రక్షించిన బీఆర్ఓ

by S Gopi |
సిక్కింలో భారీ వర్షాలకు చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులు.. రక్షించిన బీఆర్ఓ
X

దిశ, నేషనల్ బ్యూరో: సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే వారందరినీ భారీ వర్షాల మధ్యే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఅర్ఓ) రక్షించింది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా మంగన్ నుంచి లాచుంగ్ మార్గంలో రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తర సిక్కింలో దాదాపు 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్లు నిలిచినప్పటికీ, ఎయిర్‌లిఫ్టింగ్ కార్యకలాపాలు ఆగిపోయినప్పటికీ సిక్కిం పరిపాలనా యంత్రాంగం పర్యాటకులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. సోమవారం ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్‌లో సుమారు 50 మంది పర్యాటకులు గ్యాంగ్‌టక్‌కు తాత్కాలిక మార్గాల ద్వారా ఖాళీ చేశారు. మంగళవారం ఉదయం వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 10వ జాతీయ రహదారిలో బెంగాల్-సిక్కిం సరిహద్దులోని రిషిఖోలా వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement

Next Story

Most Viewed