Mali: సెంట్రల్ మాలిలో సాయుధుల దాడి.. 26 మంది మృతి

by Shamantha N |
Mali: సెంట్రల్ మాలిలో సాయుధుల దాడి.. 26 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా(Africa) దేశం సెంట్రల్ మాలి(Central Mali)లో సాయుధులు జరిపిన దాడుల్లో దాదాపు 26 మంది చనిపోయారు. డెంబో గ్రామంలో పొలాల్లో పనిచేసుకుటుండగా దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. డెంబో గ్రామం బుర్కినాఫసో దేశంతో సరిహద్దులు కలిగి ఉంది. అయితే, ఇప్పటివరకు ఏ వర్గం కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. సరిహద్దు ప్రాంతల్లో ఇలాంది దాడులు అధికంగా మారాయని అధికారులు తెలిపారు. కానీ, సైన్యం మాత్రం ఇలాంటి దాడులు నిలువరించలేకపోతోందని స్థానికులు సైతం వేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలపై ఉగ్ర సంస్థ అల్‌ ఖైదాకు(al-Qaida) అనుబంధంగా పని చేసే జేఎన్‌ఐఎం గ్రూప్‌ దాడి చేస్తుంది. ఈ నెలలోనే ఓ పెళ్లిలో 21 మందిని చంపేశారు. ఇకపోతే, ఈ దాడి కూడా అల్ ఖైదా పనే అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సెంట్రల్, నార్త్ మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సాయంలో భద్రతాబలగాలు తరిమికొట్టాయి. అయితే, వారే గ్రూపులుగా మారి తరచుగా గ్రామాలు,సైన్యంపై దాడులుకు దిగుతున్నాయి. ఈ ముఠాను అంతం చేసేందుకు సైనికులు సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు.

Advertisement

Next Story