- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నాం: ఢిల్లీ మార్చ్ ఖాతాల నిలిపివేతపై ఎక్స్ స్పందన
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలతో ముడిపడిన ఖాతాలను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ పలు ఖాతాలు, పోస్టులను గురువారం నిలిపివేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే.. భావప్రకటనా స్వేచ్ఛను సాకుగా చూపి ఇలాంటి పోస్టులను నిలిపి వేయొద్దని తెలిపింది. ‘ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా.. దేశంలో మాత్రమే రైతుల నిరసనలకు సంబంధించిన ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. కానీ ఈ చర్యలతో ఎక్స్ విభేదిస్తుంది. భావప్రకటనా స్వేచ్ఛను విస్తరింపజేయాలని కోరుతున్నాం’ అని పేర్కొంది. ‘చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రచురించలేకపోయాం. కానీ పారదర్శకతకు వాటిని పబ్లిక్ చేయడం చాలా అవసరం. లేకపోతే అది ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి దారి తీస్తుంది’ అని స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ చలో మార్చ్‌కు సంబంధించిన 177 ఖాతాల సస్పెండ్ చేయాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, రెడ్డిట్, ఎక్స్ లకు ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఖాతాలన్నింటినీ బ్లాక్ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.