- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తనది, అమిత్ షా మాటలను వక్రీకరిస్తున్నారు: ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా నకిలీ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనలేని రాజకీయ ప్రత్యర్థులు టెక్నాలజీని దుర్వినియోగం చేసి సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను ప్రచారం చేస్తున్నారని మోడీ అన్నారు. సోమవారం పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోడీ సోషల్ మీడియా, టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిల్జెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించిన నకిలీ వీడియోల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నకిలీ వీడియోల గురించి అధికారులకు తెలియజేయాలని కోరారు. సామాజిక అనిశ్చితి సృష్టించేందుకు తనది, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి నేతల వ్యాఖ్యలను వక్రీకరించడానికి రాజకీయ ప్రత్యర్థులు ఏఐని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీని వాడి తన గొంతుతో ఫేక్ వీడియోలు సిద్ధం చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. అలాంటి వాటిని గుర్తిస్తే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వచ్చే నెల రోజుల్లో పెద్ద సంఘటనను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోడీ పేర్కొన్నారు. ఇటువంటి ఫేక్ వీడియోల నుంచి సమాజాన్ని రక్షించడం మన బాధ్యత. వాటి వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నానని మోడీ వెల్లడించారు.