కాంగ్రెస్ 'తుక్డే, తుక్డే గ్యాంగ్‌కి సుల్తాన్': ప్రధాని మోడీ ఎద్దేవా

by S Gopi |
కాంగ్రెస్ తుక్డే, తుక్డే గ్యాంగ్‌కి సుల్తాన్: ప్రధాని మోడీ ఎద్దేవా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆదివారం కర్ణాటకలో జరిగిన జరిగిన మెగా బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. కాంగ్రెస్‌ను 'తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్' అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆ పార్టీ దేశాన్ని విభజించడం, విచ్ఛిన్నం చేయడం, బలహీనపరచడం వంటి ప్రమాదకరమైన ఉద్దేశాలను కలిగి ఉందని ఆరోపించారు. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. దోపిడీ కారణంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిపోతున్నాయని, కర్ణాటక నుంచి దేశవ్యాప్తంగా వందల కోట్ల నల్లధనం తరలిపోతోంది. ఇది కాంగ్రెస్ పాలనకు నమూనా అని అన్నారు. 'భారత్ దేశ సేవలో తమ పిల్లలను సాయుధ దళాలకు పంపాలని కలలు కనే నేల. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తుక్డే తుక్డే గ్యాంగ్‌గా మారుతోంది. దేశాన్ని నిర్వీర్యం చేయడం లాంటి పనులను కాంగ్రెస్ చేస్తోందన్నారు. ఈ సభలో ఎన్డీఏకు మద్దతుగా మోడీతో పాటు జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధానీ హెచ్‌డీ దేవెగౌడ కూడా వేదికను పంచుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జేడీ(ఎస్) ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story