Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తొలి తీర్మానం.. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తొలి తీర్మానం.. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల అనంతరం కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తొలి తీర్మానం చేస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శనివారం ఆయన శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కశ్మీర్ అసెంబ్లీ తొలి తీర్మానం చేస్తుందన్నారు. ప్రస్తుతం జరగబోయే కశ్మీర్ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. 2019 ఆగస్టు5 న జరిగిన చర్యలను కశ్మీర్ ప్రజలు ఏకీభవించడం లేదన్నారు. కాబట్టి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడమే అసెంబ్లీ తొలి విధి అని చెప్పారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఒక రోజు తర్వాత ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ)తో సహా పలు రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

Next Story