- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రామ మందిర నిర్మాణం రాజకీయం కాదు, ధర్మ నీతి'
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం పేరుతో 'రాజకీయం' చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. అది 'రాజనీతి' (రాజకీయం) కాదని, 'ధర్మనీతి' (ధర్మ మార్గం) అని వ్యాఖ్యానించారు. తాను ధర్మనీతికి చెందిన వాడిగా రామభక్తులకు సేవ చేయడమేనని, నేను ఒక పూజారిని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రామ మందిర వేడుకలను ఆర్ఎస్ఎస్, బీజేపీ పూర్తిగా మోడీకి సంబంధించిన కార్యక్రమంగా మార్చేశాయని విమర్శలు చేస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందడానికే దీన్ని రాజకీయ జిమ్మిక్కు అని చెబుతున్నాయి.