Ajit Pawar : కుమారుడి రాజకీయ భవితవ్యంపై అజిత్ పవార్ కీలక ప్రకటన

by Hajipasha |   ( Updated:2024-08-15 15:14:28.0  )
Ajit Pawar : కుమారుడి రాజకీయ భవితవ్యంపై అజిత్ పవార్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ కీలక ప్రకటన చేశారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సీటు నుంచి ఈసారి తన కుమారుడు జై పవార్ పోటీ చేసే అవకాశం ఉందని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే దీనిపై పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఇది ప్రజాస్వామ్యం. ఇప్పటికే నేను ఏడెనిమిది సార్లు బారామతి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి గెలిచాను. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఎన్‌సీపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయమే ఫైనల్. అది ప్రజాభీష్టం ప్రకారమే ఉంటుంది’’ అని అజిత్ పవార్ తెలిపారు.

Advertisement

Next Story