Assembly Election Results: సంబరాలకు రెడీ అయిన బీజేపీ.. ప్రధాన కార్యాలయంలో జిలేబీల తయారీ

by Shamantha N |
Assembly Election Results: సంబరాలకు రెడీ అయిన బీజేపీ.. ప్రధాన కార్యాలయంలో జిలేబీల తయారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ(Assembly Election Results) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ముందంజలో ఉంది. జార్ఖండ్ లోనూ జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఎన్డీఏ గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఫలితాల ట్రెండింగ్ మధ్యలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి కన్పిస్తోంది. అయితే, ఈ సానుకూల ఫలితాల మధ్య బీజేపీ గెలుపు సంబరాల ట్రెండ్ ని మార్చింది. లడ్డూలతో కాకుండా జిలేబీలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జోరుగా జిలేబీలు తయారు చేస్తున్నారు.

మహారాష్ట్రలో బీజేపీ హవా..

ఇకపోతే, మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరిగగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా.. మహారాష్ట్రలో అధికార మహాయుతి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 215 స్థానాల్లో అధికార మహాయుతి( Mahayuti) ఆధిక్యంలో ఉండగా.. 3 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ( Maha Vikas Aghadi) 15 స్థానాల్లో ముందంజలో ఉంది. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. కాగా.. ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి (INDIA) నేతృత్వంలోని జేఎంఎం (Jharkhand Mukti Morcha) 50 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 30 స్థానాల్లో ముందంజలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed