Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఓవైసీ

by S Gopi |
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఓవైసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రం వక్ఫ్(సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 'వక్ఫ్ సవరణ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నాను. ఇది చట్టం కాదని, వక్ఫ్ బోర్డును ద్వంసం చేసి, ముస్లింలను అంతం చేసేందుకు తీసుకొచ్చినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బిల్లును ప్రవేశపెట్టడంపై దీన్ని వ్యతిరేకిస్తూ రూల్ 72 కింద స్పీకర్‌కు నోటీసు పంపాం. ఈ బిల్లు ఆర్టికల్ 14,15,25 సూత్రాలను ఉల్లంఘిస్తోందని నమ్ముతున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షతతో కూడిన, ఏకపక్షమైన, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంపై దాడిగా భావిస్తున్నామని ' ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ మసీదులను లాక్కోవాలని, మితవాద హిందూత్వ సంస్థలు దర్గాలను లాక్కోవాలనుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇది మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతం. ఎవరైనా ముస్లిం కాదా అని నిర్ణయించడానికి మీరు ఎవరు? అని ఒవైసీ ప్రశ్నించారు.

Next Story

Most Viewed