- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు: ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పాలనలో చొరబాటుదారులు పెరుగుతున్నారని, రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు ఎవరూ లేరని బెంగాల్ ప్రజలను మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం బరాక్‌పూర్‌లో జరిగిన ర్యాలీ ప్రసంగించిన ప్రధాని, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఐదు హామీలు ఇచ్చారు. 'మతం ఆధారంగా ఎవరూ రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఎవరూ ముట్టుకోలేరు. శ్రీరామనవమి జరుపుకోకుండా మిమ్మలని ఎవరూ అడ్డుకోలేరు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాదు, సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని' పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ఇస్తుందనే కారణంతోనే ప్రతిపక్షాలు సీఏఏను విలన్‌గా చూపిస్తున్నాయని మోడీ విమర్శించారు. సీఏఏ బాధితులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టం. ఇది ఎవరి పౌరసత్వాన్ని తీసివేయదు. కానీ కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు దానికి అబద్దాల రంగు పులిమాయని మోడీ ఆరోపించారు. ఒకప్పుడు బెంగాల్‌లో అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగాయి. నేడు టీఎంసీ పాలనలో బాంబుల తయారీ పరిశ్రమ చాలా ఛోట్ల నడుస్తోంది. ఒకప్పుడు బెంగాల్ చొరబాటుదారులపై తిరుగుబాటు చేసే పరిస్థితి నుంచి నేడు టీఎంసీ రక్షణలో చొరబాటుదారులు పెరుగుతున్నారని మోడీ పేర్కొన్నారు.