- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు లేవు: కేంద్రం
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో ప్రస్తుతం రిజర్వేషన్ విధానం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం తెలిపారు. అయితే, జడ్జీలుగా నియమించే సమయంలో తగిన ప్రాతినిధ్యం లేనివారికి మాత్రం ప్రాధాన్యత కల్పించాలని కొలీజియానికి సూచించామని చెప్పారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో, న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తుందా? అంటూ డీఎంకే నేత తిరుచ్చి శివ లేవనెత్తిన ప్రశ్నకు కిరణ్ రిజిజు స్పందిస్తూ, ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించడంలేదని జవాబిచ్చారు.
అయితే, జడ్జీల సిఫార్సుల సమయంలో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలు, మహిళలు, ఇతర వర్గాల సభ్యుల పేర్లను దృష్టిలో పెట్టుకోవాలని కొలీజియం సభ్యులకు సూచించానని చెప్పారు. అలాగే, మరో ప్రశ్నకు జవాబుగా, దేశంలోని పలు హైకోర్టుల్లో 210 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆయా హైకోర్టు కొలీజియాలు పేర్లను సిఫార్సు చేస్తే, నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు.