Ajit Pawar: అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, శరద్ పవార్‌కు పోటీ లేదు: అజిత్ పవార్

by S Gopi |
Ajit Pawar: అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, శరద్ పవార్‌కు పోటీ లేదు: అజిత్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, తన మామ శరద్ పవార్‌కు మధ్య ఎలాంటి పోటీ ఉండదని ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. తాను స్వంతంగానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని, అధికార మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఏఎన్అకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అజిత్ పవార్.. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి ఒక కథనాన్ని అల్లాయని, దానివల్ల మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందని, పాలక కూటమి 48 సీట్లలో 17 మాత్రమే గెలవగలిగిందన్నారు. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రజల వద్దకు వెళ్తున్నారని, లోక్‌సభ ఎన్నికల సమయంలో దూరమైన వారు తిరిగి తమకు మద్దతిచ్చేలా అభ్యర్థిస్తారని చెప్పారు. తనకు, శరద్ పవార్‌కు పోటీ ఏం లెదు. ఆయన అనుకున్నది ఆయన చేశారు. తాను మహాయుతి కోసం ప్రచారం చేస్తున్నానని అజిత్ పవార్ పేర్కొన్నారు.

Advertisement

Next Story