- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకే విమానంలో నితీస్, తేజస్వీ యాదవ్.. ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్ట్ తప్పదా?
దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు వెల్లడైంది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ఎన్డీయే కూటమికి 293, ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇరువైపుల కూటమి నేతలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చే నేతలతో సంప్రదింపులు, చర్చలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు వేరువేరుగా కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈ మీటింగ్ వేళ బిహార్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిహార్ సీఎం, జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకే విమానంలో అదీ వెనుక వెనుక సీట్లలోనే ప్రయాణించారు. వేర్వేరు కూటములకు చెందిన వీరు ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కీలక చర్చల నిమిత్తం హజరయ్యే ముందు ఇలా ఒకే విమానంలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది.
నితీశ్, చంద్రబాబు నిర్ణయంపై జోరుగా చర్చ:
కేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలు కీలకంగా మారాయి. జేడీయూ బిహార్ లో 12 సీట్లు, టీడీపీ ఏపీలో 16 స్థానాలు గెలుచుకుంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, పరిచయాల కారణంగా ఈ ఇద్దరు నేతలు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపితే సమీకరణాలు పూర్తిగా మారిపోయి అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ దేశ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఘనవిజయం సాధించిన చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరుతారంటూ శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు సైతం ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే ఇవాళ జరగబోయే ఇరు కూటముల భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.