- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అందులో విలీనం చేయాలని నితీశ్ నన్ను సంప్రదించారు'.. మాజీ ప్రధాని దేవెగౌడ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: జేడీఎస్‌ను జేడీయూలో విలీనం చేసి, ఇండియా కూటమిలో చేరాలన్న నితీష్ కుమార్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు. ఇక జేడీఎస్ వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లుగా ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. అయితే, నాలుగు నెలల క్రితమే మాజీ జనతాదళ్ పార్టీలతో కూడిన ‘జనతా ఫ్రీడమ్ ఫ్రంట్’ ప్రతిపాదనతో నితీష్ తనను సంప్రదించినట్లు దేవెగౌడ తెలిపారు. కానీ అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ‘జాతీయ పదవులపై ఆసక్తి లేదు. ప్రస్తుతం నా వయసు 91 ఏళ్లు.. కాంగ్రెస్ నన్ను ఎలా వదులుకుందో చూశాను. పైగా ఈ వయస్సులో నాకు ఎలాంటి ప్రయోగాలు అక్కర్లేదు’ అని స్పష్టం చేశారు.
ఒప్పించాలని నితీష్ తన పార్టీ అధ్యక్షుడిని, ఇతర సీనియర్ నాయకులను పంపినప్పటికీ అంగీకరించలేదన్నారు. ఒకవేళ ముందుకు వెళ్లాలని భావిస్తే, ఇతర పార్టీలను సంప్రదించవచ్చని వారికి సూచించినట్లుగా దేవెగౌడ చెప్పారు. కాగా.. నితీష్ కుమార్ జేడీయూతో పాటు కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమిలోనే ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ సహా మరికొన్ని ఇతర మాజీ జనతాదళ్ పార్టీలు కూడా అందులోనే ఉన్నాయి.