Niti aayog: నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం

by vinod kumar |
Niti aayog: నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమికి మద్దతుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. జూలై 27న జరిగే మీటింగ్‌కు వెళ్లడం లేదని తెలిపారు. పంజాబ్ రాష్ట్రం గణనీయమైన సహకారం అందించినప్పటికీ, కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడంలో విఫలమైనందున సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 80 కోట్ల మందికి రేషన్ అందజేస్తామని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలో పంజాబ్ ప్రధాన ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్ర మైనప్పటికీ దాని గురించి ప్రస్తావించలేదని ఫైర్ అయ్యారు. పంజాబ్ 532 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోందని, దేశ ప్రయోజనాల కోసం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు. కేంద్రప్రభుత్వం రోడ్లను దిగ్బంధించి రాష్ట్రంపై భారం మోపిందన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తమ ప్రభుత్వం ఆర్థిక వనరులను పెంచుతుందని హామీ ఇచ్చారు. పంజాబ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, గతంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, డీఎంకే ప్రకటించాయి.

Advertisement

Next Story