- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NET-TET Exams: ఒకే టైంలో నెట్, టెట్ పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు..!
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల(Assistant Professors) నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్(NET) నోటిఫికేషన్ ను యూజీసీ(UGC) ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని యూజీసీ ఇదివరకే ప్రకటించింది. అలాగే తెలంగాణ(TG) రాష్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ ను నవంబర్ 7న విడుదల రాష్ర విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. టెట్ పరీక్షలను కూడా జనవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు పరీక్షల షెడ్యూల్(Shedule) ఒకే టైములో(Same Time) ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దాన్ని పోస్ట్ ఫోన్ చేయడం కుదరదని, టెట్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని వారు కోరుతున్నారు. మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడక తప్పదు.