NEET (UG)-2024: ఆన్సర్ షిట్‌లో 4 మార్కులు కోత.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన 44 మంది

by Shiva |
NEET (UG)-2024: ఆన్సర్ షిట్‌లో 4 మార్కులు కోత.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన 44 మంది
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (యూజీ) ప్రశ్నాపత్రం లీకేజీ, నిర్వహణపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విద్యార్థులు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం ధర్మాసనం మంగళవారం తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలోనే నీట్ (యూజీ) ఫలితాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా, పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల్లో 4.2 లక్షల మంది 4 మార్కులను లాస్ అయ్యారు. అయితే, భౌతిక శాస్త్రంలో ఓ ప్రశ్నకు రెండు సమాధానలు కరెక్ట్ అని ఎన్టీఏ చెప్పడాన్ని సవాలు చేస్తూ.. ఓ అభర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆయన పిటిషన్‌ను విచారణ చేపట్టిన ధర్మానసం ఢిల్లీ ఐఐటీ సూచన మేరకు ఆప్షన్ 4ను టిక్ చేసిన వారికే మార్కులు ఇవ్వాలంటూ కోర్టు తీర్పును వెలువరించంది. ఈ పరిణామంతో ఫస్ట్ ర్యాంక్ సాధించిన 44 మంది అభ్యర్థులు ఆ ర్యాంకును కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed