Udhayanidhi : బీసీలు, అణగారిన వర్గాల అణచివేత కోసమే నీట్, సంస్కృతం

by Hajipasha |
Udhayanidhi : బీసీలు, అణగారిన వర్గాల అణచివేత కోసమే నీట్, సంస్కృతం
X

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET)పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పరీక్షను ఆయన సంస్కృత(Sanskrit) భాషతో పోల్చారు. బీసీ, గ్రామీణ, అణగారిన వర్గాల అభ్యర్థులను అవకాశాలకు దూరం చేసేందుకు నీట్ పరీక్ష, సంస్కృత భాషలను ఉపయోగిస్తున్నారని ఉదయనిధి(Udhayanidhi) విమర్శించారు.

‘‘1920వ దశకంలో సంస్కృత భాష తప్పనిసరిగా తెలిసిన వారికే వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చేవారు. ఆ విధానం వల్ల ఆనాడు ఎంతోమంది బీసీలు వైద్యవిద్యకు దూరమయ్యారు’’ అని ఆయన చెప్పారు. ‘‘ద్రవిడ రాజకీయాలు - భాష, సాహిత్య భావనలు’’ అనే అంశంపై కేరళలోని కోజికోడ్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఉదయనిధి ఈ కామెంట్స్ చేశారు. తమిళ సాహిత్యం, భాష అనేవి ద్రవిడ రాజకీయాలకు పునాది రాళ్లు అని ఆయన చెప్పారు. తమిళనాడు, కేరళ దేశంలోనే అత్యంత ప్రగతిశీలక రాష్ట్రాలు అని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలు ఫాసిస్ట్, మతవాద శక్తులను పాలనకు దూరంగా ఉంచడంలో సక్సెస్ అయ్యాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed