రైల్వే మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్

by Javid Pasha |
రైల్వే మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ పై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. దాదాపు 288 మంది చనిపోగా.. 1000 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయన్న ఆయన.. ఇందుకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెహ్రూ పీఎంగా ఉన్న సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న శాస్త్రి ఓ రైల్వే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని గుర్తు చేశారు.

నాటి ప్రధాని ఎంత వారించినా వినకుండా శాస్త్రి రాజీనామా చేశారని, కానీ నేటి రైల్వే మంత్రి మాత్రం దేశ ప్రజలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీ పాలనలో రైల్వే వ్యవస్థ దెబ్బతిన్నదని శరద్ పవార్ ఆరోపించారు. కాగా బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.

Next Story

Most Viewed