Ncert books: పాఠ్యపుస్తకాల్లో ప్రవేశికను తొలగించడం సరికాదు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by vinod kumar |
Ncert books: పాఠ్యపుస్తకాల్లో ప్రవేశికను తొలగించడం సరికాదు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: పలు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి రాజ్యాంగ ప్రవేశికను తొలగించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ తెలిపిది. ఈ అంశాన్ని బుధవారం రాజ్యసభలో లేవనెత్తింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..భారత రాజ్యాంగానికి ఆత్మ, పునాది అయిన ప్రవేశికను పాఠ్యపుస్తకాల్లో ప్రచురిచేవారని తెలిపారు. పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రవేశిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కానీ దీనిని పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ద్వారా ఇది దేశంపై మతపరమైన భావజాలాన్ని రుద్దే ప్రయత్నమని ఆరోపించారు. సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా ఉంటే తప్ప రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగదని అభిప్రాయపడ్డారు.

ప్రతి పౌరుడూ భావి తరానికి ఉపయోగపడే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పునాది సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు పాఠ్యాంశాలను తారుమారు చేయడం ద్వారా ప్రజలపై తమ మతతత్వ భావజాలాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్సీఈఆర్టీ తీసుకున్న చర్య సరైనది కాదని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, పాఠ్యపుస్తకాల నుంచి పీఠికను తొలగించే చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉన్నాం: జేపీ నడ్డా

ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. రాజ్యాంగ రక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తాను ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాన్ని గానీ, మార్పును గానీ చూడనప్పటికీ రాజ్యాంగ విలువలను దుర్వనియోగం చేస్తే సహించేది లేదన్నారు. ఈ అంశంపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఎటువంటి భయం అవసరం లేదని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed