నా పేరు కేజ్రీవాల్..కానీ నేను టెర్రరిస్టును కాను: జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం

by samatah |
నా పేరు కేజ్రీవాల్..కానీ నేను టెర్రరిస్టును కాను: జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఓ సందేశం పంపినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆ సందేశాన్ని చదివి వినిపించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ మెసేజ్ పంపినట్టు వెల్లడించారు. కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీసేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కానీ కేజ్రీవాల్‌ను ఎంత విచ్చిన్నం చేయాలని చూస్తే అంతే బలంతో పైకి లేస్తాడని చెప్పారు. కేజ్రీవాల్ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు.

కేజ్రీవాల్‌తో భగవంత్ మాన్ భేటీ అయిన పరిస్థితులను బట్టి చూస్తే ఢిల్లీ సీఎంపై బీజేపీకి ఎంత ద్వేషం ఉందో స్పష్టమవుతోందన్నారు. జెడ్ ప్లస్ భద్రతను కలిగిఉన్న భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్‌ను గాజు అద్దం వెనుక నుంచి కలుసుకునేలా చేశారని, ఇది ప్రధాని మోడీకి సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ఎలక్టోరల్ బాండ్లు చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఓ ఇంటర్వ్యూలో మోడీ ఎలక్టోరల్ బాండ్ స్కీమును సమర్థించారు. అది అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమే. కాబట్టి వెంటనే మోడీ సుప్రీంకోర్టుకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed