Muda scam: లోకాయుక్త ఎదుట హాజరైన సిద్ధరామయ్య.. రెండు గంటలపాటు విచారణ

by vinod kumar |
Muda scam: లోకాయుక్త ఎదుట హాజరైన సిద్ధరామయ్య.. రెండు గంటలపాటు విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Muda) కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (sidda Ramaiah) బుధవారం లోకాయుక్త (Lokayuktha) ఎదుట హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆయనను అధికారులు విచారించారు. సుమారు ముగ్గురు ఆఫీసర్లు ఇంటరాగేట్ చేసినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా సిద్ధరామయ్య ఎలాంటి పత్రాలను అందించలేదు. అవసరమైతే మరోసారి విచారించనున్నట్టు సమాచారం. కాగా, ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, మరికొందరిపై కేసు నమోదైంది. పార్వతికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్టు లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరయ్యారు.

అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చా: సిద్ధరామయ్య

ముడా కేసులో లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. వారు ప్రతిదీ రికార్డు చేశారని, అనంతరం నాకు చూపించారని చెప్పారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ (Jds) పార్టీలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా తాను ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మరోసారి విచారణ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మళ్లీ విచారణ ఉంటుందా లేదా తనకు తెలియదని అధికారులు కూడా ఏం చెప్పలేదని వెల్లడించారు.

Advertisement

Next Story