MP Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు షాక్.. అరెస్ట్ చేయాలంటూ సుల్తాన్‌పూర్ కోర్ట్ ఆదేశాలు

by vinod kumar |
MP Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు షాక్.. అరెస్ట్ చేయాలంటూ సుల్తాన్‌పూర్ కోర్ట్ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌కు షాక్ తగిలింది. ఆయనను వెంటనే ఆరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టు మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..2001 జూన్ 19న విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపగా రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో సంజయ్ సింగ్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గతేడాది జనవరి 11న వీరందరినీ దోషులుగా ప్రకటించి..మూడు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం వారిని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే వారు పదే పదే కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సంజయ్ సింగ్‌తో పాటు మిగతా వారందరికీ నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. నిందితులందరినీ అరెస్టు చేసి ఆగస్టు 28లోగా కోర్టులో హాజరుపరచాలని తెలిపింది.

Advertisement

Next Story